అక్క ఆచూకీ కోసం తొమ్మిదేళ్లుగా వెతుకుతూ నిజాన్ని వెలికి తీసిన తమ్ముడు

sister mystery reveals brother

తోడబుట్టిన ఓ అక్క ఆచూకి కోసం తమ్ముడు పడిన తపన ఇది.. తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఆచూకీ లేకుండా పోయిన అక్క కోసం నిరంతరం వెతుకులాడుతూ యువకుడు పడిన తపన అంతా ఇంతా కాదు…వెతుకులాటలో అక్క క్షేమంగా ఉంటే చాలనుకున్నాడు… కానీ చివరికి తేలిందేమిటంటే కట్టుకున్నోడే కాలయముడయ్యడాని.. అతి దారుణంగా హత్య చేసి బావిలో పడవేసి.. ఆమెకు పుట్టిన సంతానంలో బాబును కొండ మల్లేపల్లి తెలిసినవారికి, పాపను హైద్రాబాద్ లో విక్రయించి..మరో వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడు.. మూడు సంవత్సరాలపాటు డిటెక్టివ్ పరిశోధన చేసిన యువకుడు తన అక్కను ప్రేమించింది హైదరాబాదులో డ్రైవర్గా పనిచేస్తున్న ఓ యువకుడు అన్న సంగతి తెలుసుకున్నాడు కష్టపడి తన అక్కను ప్రేమ వివాహం చేసుకున్న అతని అడ్రస్ తెలుసుకుని ఆ ఊరికి వెళ్లి జరిగిన ఘోరాన్ని సవివరంగా సేకరించి మొదట ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు వారి సూచనమేరకు మర్రిగూడ పోలీసులు ఫిర్యాదు చేశాడు పోలీసులు రంగంలోకి దిగి ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కానీ ఈ గోరం చేసినట్లు హత్య చేసి బావిలో పడేశారు అని ఇద్దరు పిల్లలను విక్రయించాడని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం…వివరాలలోకి వెళ్తే నార్కెట్ పల్లి మండలం మాండ్రా గ్రామానికి చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంక , మర్రిగూడెం మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన మోర.హనుమంతు ప్రేమించుకొని బయటికి వెళ్లి 2004 లో వివాహం చేసుకున్నారు…హనుమంతు హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.. వీరిద్దరికి 2005 లో బాబు, 2006 లో పాపా జన్మించింది…2006 నుండి ప్రియాంక ఆచూకీ లభించక పోవడంతో అప్పటి నుండి ప్రియాంక తమ్ముడు ఉపేందర్ వెతకడం ప్రారంభించాడు…

2004లో పెళ్లి.. 2005లో కొడుకు.. 2006లో కూతురు.. 2006 నుండి భార్య ఆచూకీ లేదు. అప్పటి నుండి తమ్ముడు ఉపెందర్ తన అక్క ప్రియాంక ఆచూకీ కోసం మొదలు పెట్టాడు..

 

-అశోక్ రెడ్డి, నల్గొండ