‘ఓ మై గాడ్.. సో సెక్సీ’.. : శ్రీరెడ్డి

sri reddy, kiki challenge

ఇటీవల సెలెబ్రిటీలు చేస్తున్న కికి ఛాలెంజ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ తారలు ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ మరొకరికి సవాల్ విసురుతున్నారు. ఈ అందమైన భామలు విసురుతున్న ఛాలెంజ్‌లకు యూత్ ఆకర్షితులై వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఈ ఛాలెంజ్‌ల పేరుతో కదులుతున్న కార్లలో నుంచి దిగి రోడ్డుపై డ్యాన్స్‌లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఈ కికి ఛాలెంజ్‌కు సంబంధించిన ఓ వీడియో పెట్టి అందరికి షాకిచ్చింది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ వివాదంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న శ్రీరెడ్డి ఈ ఛాలెంజ్ వీడియో పోస్ట్ చేయడంతో పాటు ‘ఓ మై గాడ్.. సో సెక్సీ’.. అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈ కికి ఛాలెంజ్ చేసింది శ్రీరెడ్డి కాదు.. ఓ ఫారెన్ ముద్దుగుమ్మ.. సేమ్ టూ సేమ్ శ్రీరెడ్డి పోలికలతో ఉండటంతో అందరూ శ్రీరెడ్డి అనే భావిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.