స్నేహితురాలు చేసిన బిత్తిరి పనికి ఆస్పత్రి పాలైన యువతి

teenager-thrown-waterfall-her-friend-washington

విహార యాత్రలో స్నేహితురాలు చేసిన బిత్తిరి పనికి ఓ యువతిని ఆస్పత్రి పాలైంది. వాషింగ్టన్‌ కు చెందిన స్నేహితులు యాక్టోల్‌లోని మౌల్టన్‌ జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. అందులో 16 ఏళ్ల యువతి కూడా వెళ్ళింది. ఈ క్రమంలో జలపాతం పైనున్న బ్రిడ్జి అంచున ఆ యువతి నిలుచుని ఉంది. దీంతో వెనకాల నిల్చున్న ఆమె స్నేహితురాలు ఆమెను ఒక్కసారిగా జలపాతంలోకి తోసివేసించి. అంతే ఆమె ఒక్కసారిగా 60 అడుగుల పై నుంచి నీటిలో పడిపోయారు. దీంతో బ్యాలెన్స్ తప్పి నీటిలో పట్టుకోల్పోయింది. ఆమెకు 5 ప్రక్కటెముకలు విరగడంతోపాటు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఆమె తల్లి మాట్లాడుతూ..నా కూతురు కొలుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ చర్యకు పాల్పడ్డ అమ్మాయి తను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నా కూతురిని చంపాలనే చూసిందని ఆరోపించారు.కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.