అక్రమ సంబంధం.. ఫిల్మ్ నగర్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్..

wife kills husband

ఫిల్మ్ నగర్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్. ఓ తల్లిగా పిల్లలను కాపాడడానికి భర్తను చంపానని బిల్డప్ ఇచ్చింది. కానీ అదంతా కట్టుకథే అని తేలింది. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని వెల్లడైంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా మర్డర్ చేసింది. పిల్లలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు కేసును ఛేదించారా? మరి సీన్ నుంచి ప్రియుడిని ఎందుకు తప్పించింది? కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే పోలీసులను తప్పుదోవ పట్టించిందా? ఇంతకీ ఈ కేసు మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు?

హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బానోతు జగన్ నాయక్ హత్య కేసులో అతడి భార్య అక్రమ సంబంధం బయటపడింది. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకుంది ఖతర్నాక్ లేడీ. దీన్ని కప్పిపుచ్చుకోడానికి భర్త నుంచి పిల్లలను కాపాడుకోడానికి తనే మర్డర్ చేశానంటూ కట్టు కథ అల్లింది. అంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే కథ నడిపినా… అమ్మ చెప్పొద్దంది అనే బాలుడి మాటలు అనుమానాలు రేకెత్తించాయి. అటు ఇంటి యజమాని కూడా అక్రమ సంబంధం గురించి అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ రెండింటి ఆధారంగా పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. ప్రియుడు తోట బెనర్జీతో కలిసి దేవిక… భర్తను హత్య చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. మర్డర్ చేసిన వెంటనే ప్రియుడిని తప్పించి నేరం తనపై వేసుకుంది దేవిక. కానీ ఈ కేసులో అన్నీ అనుమానాస్పదంగా ఉండడంతో బంజారాహిల్స్ పోలీసులు సమగ్ర విచారణ జరిపారు. 24 గంటల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు.

wife kills husband, wife, husband

ఫిల్మ్‌నగర్‌లోని జ్ఞానీజైల్‌సింగ్ నగర్‌లో సోమవారం అర్ధరాత్రి జగన్ హత్య జరిగింది. భర్త పెట్టే టార్చర్ భరించలేకపోయానని, ఇద్దరం కలిసి చనిపోదామని భర్త గొడవ పెట్టాడని దేవిక చెప్పింది. అంతేకాదు తన ఇద్దరు పిల్లలు ఉదయ్, జోషితను తన భర్త చంపుతానని బెదిరించడంతో… తనే హత్య చేశానని వెల్లడించింది. నోట్లో హిట్‌ కొట్టి, పురుషాంగాలపై తన్ని చంపినట్లు తెలిపింది.

దేవిక కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దేవికను అదుపులోకి తీసుకుని మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు విచారించారు. దేవిక పిల్లలను కూడా విచారించిన పోలీసులు వాళ్ల నుంచి వివరాలు రాబట్టారు. జగన్ కుమారుడు గడ్డం అంకుల్ అని చెప్పడం, ఓ వ్యక్తి గేటు దూకి పారిపోయాడంటూ ఇంటి యజమాని అనడంతో పోలీసుల అనుమానం బలపడింది. ఆ ఇద్దరూ చెప్పిన వ్యక్తి తోట బెనర్జీ అని తేల్చిన పోలీసులు… అతడితోపాటు దేవికను అరెస్ట్ చేశారు.

జగన్ హత్య ఆవేశంలో జరిగింది కాదు. రెండు నెలల ముందే పక్కా ప్లాన్ వేశారు దేవిక, ఆమె ప్రియుడు బెనర్జీ. రెండేళ్ల క్రితం ఫిల్మ్‌నగర్‌లోని అడ్వాన్స్ బీపీఓ సంస్థలో దేవిక, తోట బెనర్జీ పనిచేసేవారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కలిసితిరిగే వరకు వెళ్లింది. వీళ్ల వ్యవహారం భర్తతోపాటు ఇంట్లోవాళ్లకు తెలియడంతో పెద్ద గొడవ జరిగింది. దేవిక తమ్ముళ్లు బెనర్జీని కొట్టేవరకు వెళ్లింది. ఆ తర్వాత దేవికను ఉద్యోగం మాన్పించారు. కానీ వీళ్ల మధ్య అక్రమ సంబంధ మాత్రం కొనసాగుతూనే ఉంది. రెండు నెలల క్రితం వీళ్లు అద్దెకు దిగిన ఇంటి పెంట్‌ హౌజ్‌లోనే మకాం పెట్టాడు బెనర్జీ. జగన్ లేని టైంలో వీళ్లిద్దరూ కలుసుకునేవారు.

సోమవారం రాత్రి జగన్ మద్యం తాగాడు. పన్నెండున్నర వరకు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత జగన్ నిద్రపోవడంతో బెనర్జీని కిందికి పిలిచింది దేవిక. రాత్రి 2 గంటల టైంలో భార్యను, ఆమె ప్రియుడిని జగన్ చూడ్డంతో గొడవ మొదలైంది. అప్పుడే దేవిక, ఆమె ప్రియుడు బెనర్జీ కలిసి జగన్‌ను దారుణంగా హత్య చేశారు.

గొడవ జరుగుతున్న టైంలో దేవిక తన పిల్లలను బాత్‌రూంలో పెట్టింది. ఇదంతా పిల్లలు చూడకుండా ఆమె జాగ్రత్తపడింది. కానీ పిల్లలు బెనర్జీని చూడడంతో ఈ బండారం బయటపడింది.