విశ్వ‌రూపం2 మూవీ రివ్యూ

movie review

-KUMAR SRIRAMANENI

బ్యాన‌ర్‌: రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌
జానర్ : యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌
న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు
సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌,
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌,
ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌,
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి,
నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌,
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌.

భారతదేశం గర్వించే నటుడిగా పేరుపొందిన కమల్ హాసన్ కు ప్రయోగాలే ఆ పేరు ను తెచ్చాయి. ఆ ప్రయోగాలే అతని మార్కెట్ ను పడవేశాయి. నటుడిగా శిఖర స్థాయిని చూసిన కమల్ కమర్షియల్ హీరోగా మాత్రం ఎప్పుడూ పోరాటాలే చేస్తున్నాడు. విశ్వరూపం రిలీజ్ కి విశ్వప్రయత్నాలు చేసిన కమల్ విశ్వరూపం చూపేందుకు రెండో సారి ప్రయత్నించాడు. మరి కమల్ విశ్వరూపం ఎలా ఉందోచూద్దాం..

కథ:
విశ్వరూపం కథకు కొనసాగింపుగానే తీవ్రవాది ముసుగేసుకున్న ఒక సైనికాధికారి వాసిమ్ అహ్మద్ ( కమల్ హాసన్) తన స్నేహితుడు ఉమర్ ( రాహుల్ బోస్) ను మోసగించి యుస్ ఆర్మీకి సహాయం చేస్తాడు. ఇప్పుడు తన ఒక మిషన్ కోసం యుకె కి తన భార్య నిరుపమ( పూజాకుమార్), తన తోటి ఆఫీసర్ అస్మిత( ఆండ్రియా) లతో కలసి వెళతాడు. అక్కడ ఇండియన్ ఆఫీసర్ మోసానికి గురై ఒక ప్రమాదంలో పడతాడు. అక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. తన దేశానికి తిరిగి వచ్చిన వాసిమ్ కి ఉమర్ బతికే ఉన్నాడని దేశానికి ఏదో పెద్ద ముప్పును తేబోతున్నాడని తెలుస్తుంది. మిలటరీ నుండి కోర్ట్ మార్షల్ విధింపబడిన ఆఫీసర్ గా ముద్ర వేసుకున్న వసీమ్ తన దేశాన్ని ఎలా కాపాడగలిగాడు అనేది మిగిలిన కథ..?

కథనం:
కమల్ హాసన్ ఆలోచనలు ప్రేక్షకుల అంచనాలకు దూరం గా ఉంటాయి. వారిని సర్ ప్రైజ్ చేసేందుకు కమల్ ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. కానీ విశ్వరూపం 2 లో నిదానంగా సాగే కథనం రిస్క్ గా తీసుకున్నాడు. విశ్వరూపం మొదలవగానే ఒక యాక్షన్ అడ్వెంచర్ ని ఊహించే ప్రేక్షకుల ఆశలు ఆవిరై పోవడానికి ఎంతో సేపు పట్టలేదు. కమల్ నటనలో లోపం లేదు. పోరాటాలలో, ఎమోషన్స్ సీన్స్ లో అతని నటన ఆకట్టుకుంది. అయితే అతను చెప్పదలుచుకన్న పాయింట్ తీవ్రవాదం జాతీయవాదం గా మారిన దేశంలో కూడా సామాన్యలుంటారు. చదువుకోని సామాన్యులుగా బతకాలని కలలు కనే పిల్లలుంటారు. ద్రోహులు శత్రుదేశాల్లోనే కాదు ప్రభుత్వ అధికారుల రూపం లో కూడా ఉంటారు అని నిర్మోహాటంగా చెప్పాడు కమల్ హాసన్. ముస్లిం లలో దేశ భక్తి ఉండొచ్చు అని తన క్యారెక్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసాడు. తన నమ్మే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని అవమానించాలని చూసిన ఒక అధికారితో కమల్ సంభాషణ చాలా బాగుంది. పెద్దగా అరిచి చెప్పకుండా తన దేశం పట్ల ప్రేమను ఖచ్చితంగా ఆ పాత్ర ద్వారా చెప్పాడు కమల్.

అయితే విశ్వరూపం నుండి పెద్దగా యాక్షన్ అడ్వెంచర్ లను ఆశిస్తే అవి అక్కడ డక్కడ మిణుకు మిణుకు మనే కనిపిస్తాయి. మిగిలనదంతా పూజా కుమారి, కమల్ మద్య సంభాషణలే అవి కూడా మామూలు మనుషులు అర్దం చేసుకునే ప్రేమ కాదు అన్న రేంజ్ లో ఉంటాయి. అండ్రియా రోల్ పై కావాల్సినంత కథను నడిపంచ వచ్చు. కానీ అండ్రీయా కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే పరిమితం చేసాడు. పోరాటాలను చాలా రియలిస్టిక్ గా మలచడంలో కమల్ సక్సెస్ అయ్యాడు. సినిమాలో కనిపించిన యాక్షన్ సీన్స్ చాలా రియల్ గా అనిపించాయి. ఇక మదర్ సెంటిమెంట్ సన్నివేశం చాలా బోరింగ్ గా అనిపించింది. ఒక యాక్షన్ సన్నివేశం కి మరో యాక్షన్ సన్నివేశం కి మద్యలో కమల్ ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం కాదు. ఒక సీన్ నుండి గతం లోకి వెళ్ళి అక్కడ కథ మొదలవుతుంది చాలా గందరగోళంగా కథనం నడిపించాడు. ఆ గతం లోంచి ప్రస్తుతానికి వచ్చిన ప్రేక్షకుడు అక్కడ జరిగే సన్నివేశానికి కనెక్ట్ కావడానికి టైం పడుతుంది. దీంతో కథనం అంతా చాలా నీరసంగా సాగుతున్నట్లు అనిపించింది. విశ్వరూపం పార్ట్ 1 లోని ఫూటేజ్ నే చాలా వరకూ ఇందులో కనపడుతుంది.

విశ్వరూపం చూడకుండా వెళ్లిన ప్రేక్షకులు మరింత అసహానానికి లోనైతారు. సెకండాఫ్ అయితే మరింత నీరసంగా సాగింది. కాస్త ఆండ్రియా పాత్ర ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. ఇక బతికొచ్చిన ఉమర్ వాసిమ్ మీద పగ తీర్చుకోవాలనుకోవడం.. ఉమర్ కుటుంబం బతికే ఉందని విషయం అతనికి తెలియడం.. కమల్ అతని ప్లాన్ నుండి తన భార్యను, దేశాన్ని కాపాడటం వంటి అంశాలు క్లైమాక్స్ పర్లేదు అనే ఫీల్ ని తెచ్చాయి. కానీ ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ మాత్రం ప్రేక్షకులకు కలిగింది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పోరాటాలు రియలిస్టిక్ గా ఉన్నాయి. కానీ నిదానంగా సాగే కథనం, అర్దం కానీ కథ విశ్వరూపం కు పెద్ద బలహీనతలుగా మారాయి.

చివరిగా:
నిరాశరూపం