తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా!

– తిగుళ్ల రాజశేఖర్

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందు పరిచిన.. అసెంబ్లీ స్థానాల పెంపు నెరవేరలేదు. ఎప్పటి నుంచో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు గట్టిగా కోరుకుంటున్నారు. ఏడాది క్రితం వరకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని బీజేపీ అధిష్టానం చెప్పిన తర్వాతే తెలంగాణ, ఏపీల్లో అధికార పార్టీలు… వలసలను ప్రొత్సహించాయి. పెరగనున్న అసెంబ్లీ స్థానాలతో పార్టీలోకి వచ్చే వారికి సర్దుబాటు చేయవచ్చని భావించాయి. ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే రాష్ట్రాల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించుకుంటోంది. అయితే కేంద్రం కొంతకాలంగా దీనిపై సమాధానం దాటవేస్తోంది. పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రమే చెబుతోంది.

cm chandrababu participate adhivasi dinotchavam in paderu

మనసులో మాట బయటపెట్టడం లేదు. రెండేళ్ల నుంచే అటు టీడీపీ ఇటు టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తున్నప్పటికి వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తోంది. ఇది కేవలం రాజకీయ నిర్ణయం. మోడీ-షాల చేతిలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో తమకు అనుకూలంగా పరిస్థితులు ఉంటేనే నియోజకవర్గాల పెంపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా రెండు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం అనుమానమే. ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు గెలిచే స్దితిలో లేదు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు రాష్ట్రాల్లో పోటీ ఇచ్చే స్దితిలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన అంశం అధికార పార్టీలైన టీడీపీ – టిఆర్ఎస్‌కు మేలు చేస్తుంది తప్ప తమకు కొత్తగా ఒనగూరే ప్రయోజనం లేదని బీజేపీ భావన. తెలంగాణలో 30 మంది కొత్తవారికి, అటు ఏపీలో 50 మంది కొత్తవారికి ఎమ్మెల్యేలుగా అవకాశం దొరుకుతుంది. అది అక్కడి పార్టీలకే కానీ.. తమకు ఉపయోగం లేదని చెబుతోంది. పైగా ఇక్కడ పొత్తులు కూడా లేకపోవడంతో వాళ్లకు సీట్లు డిమాండ్ చేయవచ్చన్న ఆశ కూడా లేదు. ఏపీలో సీట్లు పెంచితే చంద్రబాబుకు అనుకూలంగా మారుతుందని.. స్థానిక బీజేపీ నాయకులు… పరోక్షంగా వైసీపీ

ycp-vanchanapai-garjana-deeksha

శ్రేణులు సూచించడంతోనే బిల్లు ఆగిపోయిందని చెబుతున్నారు. అయితే ఇటీవల దీనిపై కాస్త కదలిక వచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణ వరకు పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన కేంద్రంలో ఉందని తెలుస్తోంది. మోడీకి అత్యంత నమ్మకస్తుడిగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల కంటే మిన్నగా కేసీఆర్ అభిమానిస్తున్నారు. ఆ పార్టీ ఎంపీల ప్రసంగాల్లోనూ అది స్పష్టమైంది. అడగకుండానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. నోట్ల రద్దు.. జీఎస్టీ బిల్లులకు ఆమోదం తెలిపారు. అన్ని విధాలా తమకు సహకరిస్తున్న కేసీఆర్ అడిగితే ఏదైనా చేయడానికి బీజేపీ సిద్దంగా ఉన్నట్టు ప్రచారం.

cm-kcr-review-meeting-on-raithu-bheema

ఇందులో భాగంగానే నియోజకవర్గాల పెంపుతో కేసీఆర్‌ కోరిక తీర్చేందుకు మోడీ సిద్ధంగా ఉన్నట్టు హస్తిన వర్గాలు చెబుతున్నాయి. రాజ్‌నాథ్ సింగ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు ఢిల్లీలో బీజేపీ సన్నిహిత వర్గాల సమాచారం. ఒకవేళ కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే..మూడు నెలల్లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి..నవంబర్ నెలాఖరులోగా కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికల జోలికి పోకుండా.. డీలిమిటేషన్ పూర్తైతే గడువు ముగిశాకే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ యోచిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఒక్కో పార్లమెంట్ స్థానంలో రెండేసి అసెంబ్లీ స్థానాలు పెంచాలని.. వాటి పేర్లు.. పరిధి ఎలా ఉండాలన్నది తానే నిర్ణయిస్తానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. తాము కాంగ్రెస్ ముక్త భారత్ కోరుకున్నామని.. హస్తంతో ఫైట్‌ చేస్తున్న KCR తమకు ఆప్తుడని… బీజేపీ భావన. మరి తెలంగాణలో పెంచితే… ఏపీలో పెంచకుంటే ఎలా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.