బాలుడిపై దాబా ఓనర్ లైంగిక దాడి

boy, owner

చిన్నారులపై లైంగిక దాడులు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. తమ లైంగిక కోరికలు తీర్చుకోవటానికి అభం శుభం తెలియని చిన్నారులను బలి తీసుకుంటున్నారు కొందరు మృగాళ్లు.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్‌లోని ఓ దాబాలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

ఓ బాలుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి హరిద్వార్ కన్వర్ యాత్రకు వెళ్లాడు. అయితే తను తెచ్చుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. దీంతో తిరిగి వెళ్లటానికి ఆ బాలుడి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఓ దాబాలో పని చేయటానికి వెళ్లాడు. ఆ బాలుడి అవసరాన్ని అవకాశంగా తీసుకున్నఆ దాబా యజమాని తనలో ఉన్న రాక్షస ప్రవృత్తిని బయటపెట్టాడు. తన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి 14 ఏళ్ల బాలుడిపై వికృత చర్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.