బిగ్‌బాస్ ఇంట్లోకి ‘దేవదాస్’ ఎంట్రీ..

అత్యధిక ప్రజాధరణ పొందుతున్న షో బిగ్‌బాస్. 16 మంది ఓ ఇంట్లో 100 రోజులు కలిసి ఉంటూ వారు చేసే అల్లర్లు, అలకలు, గేమ్‌లు ఆధ్యంతం ఆకట్టుకుంటున్నాయి. శని ఆదివారాలు వచ్చాయంటే హోస్ట్ నానీ ఎంట్రీతో మరింత ఊపు వస్తుంది. హౌస్‌లోని వారితో సరదాగా మాట్లాడుతూనే సున్నితంగా మందలిస్తూ ఎవరు ఎలా ఉంటున్నారు, ప్రేక్షకులు వారినుంచి ఏం ఆశిస్తున్నారు లాంటి విషయాలు గుర్తుంచేస్తుంటాడు.

ఇక ఈ హౌస్‌ని సినిమా ప్రమోషన్లకి కూడా వాడేస్తున్నారు. హీరో హీరోయిన్ల రాకతో మరింత సందడి నెలకొంటోంది హౌస్‌లో. ఈసారి ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్న నాగార్జున, నానీలు బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి కంటెస్టెంట్లకి, ప్రేక్షకులకి సరదా సంగతులు చెప్పనున్నారు. మరి ఆ ఇద్దరు హీరోలు ఎంట్రీ ఇచ్చే శనివారం ఈ రోజే కావచ్చేమో.