నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు

Andrea Jeremiah
Andrea Jeremiah

మల్టీటాలెంటెడ్ నటి ఆండ్రియా విశ్వరూపం2లో అదరగొట్టింది. తొలుత గాయనిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నటిగా మారింది. ఆండ్రియా తాజాగా కమలహాసన్‌తో నటించిన ఈ చిత్రంలో నటనతో పాటు పైట్స్‌ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ మీడియాలో చిట్ చాట్ చేసింది. ‘ఈ చిత్రంలో అశ్విత పాత్రలో నటించాను. పైట్స్ కూడా చేశాను. ఇంతకు ముందు నటన మీద ఆసక్తి ఉన్నా కాలక్షేపం కోసమే సినిమాలో నటించాను ప్రపంచం పుస్తకాలలో ఉండదు. ముందుగా సమాజాన్ని చదవాలి. ప్రతి ఒక్కరూ దేశ ప్రగతి కోసం పాటుపడాల్పిన అవసరం ఉంది. నటించడానికి ఎలాంటి నిబంధనలు లేవు. ముఖ్యంగా కథకు ప్రాధాన్యత ఇస్తాను దేశ ప్రగతిపై అందరికి బాధ్యత అవసరం.ప్రస్తుతం ‘వడచెన్నై’ సినిమా డబ్బింగ్‌‌లో బీజీగా ఉన్నాను. చాలా మంది కాస్టింగ్ కౌచ్ వ్యవహరం గురించి అడుగుతున్నారు. నాకైతే అలాంటి సంఘటనలు ఎప్పుడూ ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా ముందుకు రావాలి’ అంటూ ముచ్చటించింది ఆండ్రియా.