ఏకంగా మంత్రే.. రూ.168 కోట్ల విలువ చేసే 6లక్షల మద్యం బాటిళ్లు..

అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారని అసోం ఎక్సైజ్ మంత్రికి కోపం వచ్చింది. అందరూ చూస్తుండగానే 14 ట్రక్కుల మద్యం బాటిళ్లన్నీ రోడ్డు మీద పడేయించి తానే స్వయంగా రోడ్ రోలర్‌ నడిపి 6 లక్షల మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.

ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మద్యం తయారు చేసి గువాహటికి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. మొత్తం 13 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. కోర్టునుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన అనంతరం గోర్‌చుక్‌లో రోడ్‌రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశామని మంత్రి పరిమళ్ శుక్లబైద్య తెలిపారు.

ఇక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకి 39,085 లీటర్ల విదేశీ మద్యం అమ్ముడవుతోంది. లైసెన్స్‌లు పొందిన వైన్ షాపులు కూడా 1,448 ఉన్నాయి.