అందం కోసం ఆ క్రీములు వాడుతున్నారా..? ఇక అంతే..

drug-controller-of-india-warns-people-over-fairness-creams

“మీరు నల్లగా ఉన్నారా? నలుగురిలో నామోషీగా ఉందా? అయితే మా క్రీమ్‌ వాడండి. పాల తెలుపును సొంతం చేసుకోండి” అంటూ బోలెడన్న అడ్వర్టైజ్‌మెంట్స్‌ వస్తున్నాయి. అందంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి? అందుకే జనాలు ఇలాంటి యాడ్స్‌కు ఈజీగా అట్రాక్ట్‌ అవుతున్నారు. అందుకే ట్రెండ్‌ అంతా అందం చుట్టే తిరుగుతోంది. మామూలు బ్యూటీ పార్లర్ల నుంచి హైలెవల్‌ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ వరకు జనాలను అందాల ముసుగులో కప్పేస్తున్నారు మాయగాళ్లు. అయితే అలాంటి క్రీమ్స్‌తో కాస్త జాగ్రత్త అంటోంది ఇండియన్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌.

18 ఏళ్ల అమ్మాయి నుంచి అరవై ఏళ్ల బామ్మ వరకు.. అందరిదీ అందంగా కనిపించాలనే తపనే. అందుకు తగ్గట్టే మార్కెట్‌లో రకరకాల క్రీములు పుట్టుకొస్తున్నాయి. వాటిని విక్రయిస్తూ.. అందంపై జనాల్లో క్యాష్‌ చేసుకుంటున్నారు మాయగాళ్లు. కోట్లలో వ్యాపారం చేసేసుకుంటున్నారు. ఇవేమీ తెలియని జనాలు మాత్రం.. కలర్‌ కోసం ఆరాటపడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్ల చుట్టూ తిరుగుతూ అందానికి తాత్కాళిక మెరుపులు అద్దుకునేందుకు ఆరాటపడుతున్నారు.

అయితే ఈ ఇల్లీగల్‌ క్రీమ్స్‌ గురించి ఇండియన్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ పరిశోధకులు.. బిత్తరపోయే నిజాలు బయటపెట్టారు. పైకి అందంగా కనిపించినా.. లోలోపల చర్మాన్ని పాడు చేసే డేంజరస్‌ స్టెరాయిడ్స్‌ వీటిలో నిక్షిప్తమై ఉన్నాయని తేల్చారు. ఈ క్రీములకు గానీ, వీటి అమ్మకందారులకు గానీ ఎలాంటి నియమనిబంధనలు లేవని, వినియోగదారులు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. కలర్‌ కోసం ఆరాటపడితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు.

కలర్ ట్రీట్మెంట్ కోసం వాడుతున్న క్రిములపై జనాల్లో అంత అవగాహన లేకపోవడంతో ఈ ఇల్లీగల్‌ క్రీముల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ఇండియన్‌ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్.. ఈ క్రీముల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వీటి అమ్మకాల విషయంలో డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సీరియస్‌ ఆంక్షలు పెట్టే ప్రయత్నంలో ఉంది.

ఆధునిక యుగంలో మహిళలు బ్యూటీ పార్లర్లకు అంకితమవుతున్నారు. ఫేషియల్‌, బ్లీచింగ్ అంటూ డేంజరస్ ట్రైట్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు. కలర్‌గా ఉండాలి, కలర్‌ఫుల్‌గా ఉండాలి అనే ధ్యాసలో.. రకరకాల క్రీములపై దృష్టి పెడుతున్నారు. ఈ మాయలో పడి పోల్ లైటింగ్ క్రీమ్ వాడుతున్నారు. అయితే దానితో వచ్చే సమస్యలను మాత్రం గుర్తించ లేకపోతున్నారు. వీటిలో డేంజరస్ స్టెరాయిడ్స్‌ ఉన్నాయంటూ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది . డాక్టర్ల సలహా లేకుండా, సొంత నిర్ణయాలతో ఇలాంటి క్రీములు వాడి పిగ్మెంటేషన్ స్కిన్ రాషెస్ లాంటి చర్మ సమస్యలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తోంది.

బ్యూటీ వరల్డ్ అంతా ఫ్యాషన్ అండ్ కాస్మోటిక్ చుట్టూ తిరుగుతోంది. అందుకే ఇలాంటి ఇల్లీగల్‌ క్రీముల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అనే రేంజ్‌లో దూసుకుపోతోంది. అలాంటి మాయలో పడకుండా జాగ్రతపడమని సూచిస్తున్నాయి తాజా పరిశోధనలు. సో.. బీ అవేర్‌ ఆఫ్‌ స్కిన్‌ లైట్నింగ్‌ క్రీమ్స్‌.