వంగి వంగి దండాలు పెట్టి దేవుడికే శఠగోపం పెట్టిన భక్తుడు

man theft god haram in meerpeta

దేవునికి వంగి వంగి దండాలు పెట్టి ఆ దేవుడికే శఠగోపం పెట్టాడు ఓ భక్తుడు… పూలతో పూజించినట్టు చేసి హారాన్ని ఎత్తుకెళ్లిన గుళ్ల గజదొంగను అరెస్ట్‌ చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు… 52 ఏళ్ల వయసున్న ఇతగాడు ఇప్పటేకి 53 దేవాలయాల్లో చోరీకి పాల్పడినట్టు విచారణలో తేలింది… మీర్‌పేటకు చెందిన రాంబాబు ముత్యాల వ్యాపారి… ఉదయాన్నే స్కూటీపై దైవ దర్శనానికి బయలు దేరి పూజారి లేని ఆలయాలను టార్గెట్‌ చేసుకొని తన పని కనిచ్చేస్తాడు.. ఒకవేళ పూజారి ఉంటే 500 రూపాయల దక్షిణ వేసి చిల్లర కావాలంటూ బయటకు పంపి దేవుడినే దోచేస్తాడు… ఇటీవల ఆలయాల చోరీలపై దృష్టిపెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరాలో రికార్డు దృశ్యాల ఆధాంగా రాంబాబును పట్టుకున్నారు… అతని నుంచి 19 గ్రాముల బంగారం, 15 గ్రాముల వెండి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు… గతంలో పీడీయాక్ట్‌ పెట్టి జైలుకు పంపినా మార్పు రాకపోగా మళ్లీ అదే వృత్తిగా మార్చుకున్నట్టు పోలీసులు తెలిపారు.