పందికి పాలిస్తున్న ఆవు.. వైరల్

piglet, cow

మతాలు, కులాలు, జాతులు.. ఈ విభేదాలన్నీ మనుషులకే తప్ప తమకు కాదని నిరూపించిందా జంతువు. తనను గోమాత అని పిలువడం సరైనదేనని రుజువు చేసింది. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని శాంతినగర్ లో ఒక ఆవు.. పందికి పాలివ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జాతివైరం మరిచి కన్నబిడ్డలా పందికి పాలివ్వడం.. అమ్మతనపు కమ్మతనాన్ని తెలియజేస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం రుజువైందని చర్చించుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.