విజయవాడలో అద్దె గర్భం కలకలం

renting-womb-issue-in-vijayawada

విజయవాడలో అద్దె గర్భం కలకలం రేగింది. కార్తీకదత్త IVF సెంటర్‌లో సరోగసి చేసే యత్నం జరిగింది. గుంటూరు నుంచి ఓ యువతిని తీసుకొచ్చి అద్దె గర్భం కోసం బేరసారాలు జరిగాయి. ఆ మహిళ నిరాకరించి గొడవ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళను పోలీసులు ఎన్జీఓ హోమ్‌కు తరలించారు. విచారణ మొదలుపెట్టారు. సరోగసి వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, నర్సింగ్‌ హోంకు వచ్చిన కొందరు ఇలా గొడవ చేస్తున్నారని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది.ఈమధ్యే విశాఖలో వెలుగుచూసిన అద్దెగర్భం వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. అద్దెకు గర్భం ఇచ్చిన మహిళ ప్రాణాలపైకి రావడంతో ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. కొన్ని ఆస్పత్రుల ధనదాహంతో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న సరోసగిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి.