ఆధ్యాత్మిక గురువు బైక్ స్టంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు!

ram dev, ramdev baba, jaggi vasudev

ఇటీవల సద్గరు జగ్గీ వాసుదేవ్‌ నదుల సంరక్షణ కోసం నిర్వహించిన బైక్ ర్యాలీకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌, రాందేవ్ బాబాతో కలిసి చేసిన విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఆశ్రమం చుట్టూ డుకాటీ బైక్ మీద ఈ ఇద్దరు బాబాలు చక్కర్లు కొట్టారు. జగ్గీ వాసుదేవ్ వేగంగా బైక్‌ను నడుపుతూ స్టంట్స్ చేస్తుంటే వెనుక కూర్చున్న రాందేవ్ బాబా గాలిలో తేలియాడిపోయారు. ఈ వీడియోను కొందరూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.

జగ్గీ వాసుదేవ్ బైక్‌పై చేస్తున్న స్టంట్స్‌ని చూసి అబ్బో.. అని ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టుకుని మరీ చూస్తున్నారు నెటిజన్లు.