కొడుకు గురించి సోనాలి భావోద్వేగ పోస్ట్

Sonali Bendre shared a series of photos with son Ranveer on his 13th birthday.

ఒకప్పుడు తన నటనతో సినీ అభిమానులను అలరించిన సోనాలి బింద్రే ప్రస్తుతం హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా కూమారుడు రణ్‌వీర్ బెహ్ల్ 13వ పుట్టిన రోజు సందర్భంగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.అలాగే ‘మై నాట్-సో-లిటిల్-వన్’ అంటూ రణ్‌వీర్‌తో తాను దిగిన ఫోటోలన్ని కలిపి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘రణ్‌వీర్ నా ప్రపంచం. అన్ని కాంతులను అతనిలోనే చూసుకున్నాను. నా పదాలు కొంచెం నాటకీయంగా అనిపించవచ్చు. నేను చెప్పిన ప్రతి పదానికి అతడు అర్హుడు.రణ్‌వీర్ యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఈ వాస్తవాన్ని నమ్మడానికి నాకు కొంత సమయం పడుతుంది. చిన్నప్పుడు నువ్వు చేసిన అల్లరి, నవ్వు, అవి ఇప్పటికీ నీతోనే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ తుంటరి చేష్టలు నాలో ఎంతోబలాన్ని నింపాయి. ఇదే మొదటిసారి మనం కలిసి లేకపోవడం.ఇప్పుడు నువ్వు నాదగ్గర లేనందుకు నాకు చాలా బాధగా ఉంది. నీపై నాకు ఉన్న ప్రేమ ఎప్పటికి తరగనిది’అంటూ సోనాలి తన కుమారుడితో కలిసి తీసుకున్న వీడియోని షేర్ చేస్తూ హృదయానికి హత్తుకునే పోస్టు పెట్టింది.