శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణకు నేడు అంకురార్పణ

ttd, lord venkanna

తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు (శనివారం) అంకురార్పణ జరగనుంది. ఆదివారం ఉదయం ఆగమోక్తంగా మొలు కానున్న ఈ మహా క్రతువు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ.

శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకోసారి జరిగే మహాసంప్రోక్షణకు సర్వం సిద్ధమైంది. ఈ క్రతువు ఈనెల 12 నుంచి 16 వరకు కొనసాగుతుంది. అంకురార్పణ సందర్భంగా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విశ్వక్సేనుల ఊరేగింపు ఉంటుంది.

12న కుండలాల శుద్ధి పుణ్యావచనం
మూల విరాట్టు శక్తిని కుంభంలోకి ఆవాహనం
13న అష్టబంధన వస్తువులకు, ద్రవ్యపదార్థాలకు శుద్ధి పుణ్యాహవచనం
14న గర్భాలయంలో మరమ్మతులు
14న ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి
15న మూలవర్లకు మహాశాంతి తిరుమంజనం
16న పూర్ణాహుతి నిర్వహణ
గర్భాలయానికి, ఉప ఆలయాలకు కుంభాల తరలింపు
బ్రహ్మగోష పఠనంతో మహా సంప్రోక్షణ ముగింపు
17వ తేదీ నుంచి యథావిధిగా శ్రీవారి దర్శనభాగ్యం ఉంటుంది.

-ADVT-