కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి

under-construction-flyover-collapses-highway

నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో తెల్లవారుజామున జరిగింది. బస్తీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతర కార్మికులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాద ధాటికి పక్కనే ఉన్న బడ్డీ కొట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటన తెల్లవారుజామున చోటుచేసుకోవడంతో ఆ సమయంలో ఎవరు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఫ్లై ఓవర్‌కు సపోర్ట్‌గా ఉంచిన బీమ్‌లు నీటిలో నాని భూమిలోకి కుంగిపోయాయి. దీంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే జాతీయ రహదారి 28పై లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.