నేస్తమా… ఇన్ని రోజులు ఏమైపోయావు.. పిగ్గీ, మంకీల క్యూట్ ఫ్రెండ్షిప్..

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాది.. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లి పోయావు.. నీకోసం వెదకని చోటు లేదంటే నమ్ము.. ఇప్పటికి కలిశావు.. ఇక నిన్నెప్పటికీ వీడను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. నీ పక్కన నడిస్తే పట్టుకుని వెళ్లిపోతారేమో. అందుకే నీ వీపు ఎక్కేస్తా. నిన్ను గట్టిగా పట్టుకుంటా. అయినా నాకు తెలియక అడుగుతాను. ఇన్ని రోజులు నన్ను విడిచి ఎలా ఉన్నావు. ఒక్కరోజు కూడా నేను గుర్తుకు రాలేదా. చేసుకున్నబాసలు,చెప్పుకున్న ఊసులు అన్నీ మర్చిపోయావా. అవున్లే నువ్వు మనుషుల మధ్య ఉంటున్నావుగా వారి సంరక్షణలో పెరుగుతున్నదానివి. వారిలాగే ఆలోచిస్తున్నావేమో అని నాకు డౌట్‌గా ఉంది. సర్లే.. అయిందేదో అయిపోయింది.

ఇక నుంచైనా హ్యాపీగా ఉందాం అని ఇద్దరూ కలిసి ఎవరికీ దొరక్కుండా పరిగెట్టేస్తున్నాయి. వీరి స్నేహం చూసి కన్నుకుట్టిన చిలుక.. ఇదేం చోద్యం అంటూ చిలుకపలుకులు పలికింది. మిగిలిన జంతువులు కూడా ముక్కుమీద వేలేసుకున్నాయి. ఆంటీలు కూడా అవాక్కయ్యారు. ఆనందంగా తిరిగేస్తున్న ఆ రెంటికీ అక్కడ ఏవో నూడిల్స్ కనిపించాయి. ఎవరూ చూడట్లేదనుకుని గప్‌చిప్‌గా వాటిని తినేశాయి. మళ్లీ గ్రౌండంతా తిరుగుతున్నాయి. అలవాటు లేని నూడిల్స్ ఫుడ్డు బావున్నాయని ఎక్కువ తినేసిందే ఏమో బుజ్జి మంకీకి నిద్రొచ్చేసింది. ఇద్దరం కొద్ది సేపు పడుకుందాం అనుకున్నాయి. డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోయింది బుజ్జి మంకీ. పిగ్గీ కామ్‌గా అక్కడ్నించి జంప్ అయిపోయింది. ఎందుకో తెలిసే ఉంటుందనుకుంటా.

 

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -