అగ్ర నటుడి కొడుకు కారు బీభత్సం.. ఆటోను ఢీకొని..

actor-vikram-son-druv-car-accident

కోలీవుడ్‌ అగ్ర నటుడు విక్రమ్‌ కొడుకు ధ్రువ్‌ కారుతో బీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని పాండిబజారులో వేగంగా కారు నడుపుతూ.. అదుపుతప్పి ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టాడు. దీంతో కారు గుంటలో ఇర్రుక్కుపోయింది.ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతని కాలు విరగడంతో. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ధ్రువ్‌ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే కారును స్వాధీనం చేసుకున్నారు.

actor-vikram-son-druv-car-accident

కాగా ధృవ్ తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా తమిళ రీమేక్‌తో కోలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లో ‘వర్మ’గా ముందుకురానుంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళుతుందగా ప్రమాదం జరిగింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -