చిన్నారి సహా 8 మంది బంధువులను హత్య చేసి ఆపై..

albanias-dangerous-man-arrested-who-kills-hiseight-relatives

పగతో 8 మంది బంధువులను హత్య చేసిన హంతకుడు ఎట్టకేలకు దొరికాడు.అతడు ఎందుకలా మారి హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యల ఉదంతం అల్బేనియాలో చోటుచేసుకుంది.

అల్బేనియాకు చెందిన రిడ్వాన్‌ జైకాజ్‌ అనే 24 ఏళ్ల వ్యక్తి కొంతకాలం తన సమీప బంధువుల కుటుంబంపై పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో సైకోగా మరి విచిత్రంగా ప్రవర్తించాడు. అయితే ఇటీవల టిరానాకు 90 కిలోమీటర్ల దూరంలోని రెస్యూలాజ్‌ అనే గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి ఏకే-47తో కుటుంబంలోని అందరూ వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ ధాటికి 6 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ వ్యక్తి తన తాత అమ్మమ్మలపై కూడా కాల్పులు జరపడంతో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం వారందరు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. హత్యకు గురైన వారిలో 9 ఏళ్ల చిన్నారి, బాలిక సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలించారు. అంతేకాకుండా రిడ్వాన్‌ జైకాజ్ ఫొటోను పలు పోలీస్‌ స్టేషన్‌లకు పంపించారు. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతడు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరి సమాచారంతో ఎట్టకేలకు ఆ కరడుగట్టిన నిందితుడిని శనివారం పోలీసులకు దొరికాడు.