ఓవైపు కన్నీరు.. మరోవైపు భవిష్యత్తు వెంటాడుతోంది..

DMK Future in tamilanadu

డిఎంకే చీఫ్ కరుణానిధి మరణంతో డిఎంకే శ్రేణులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాయి. ఓవైపు కన్నీరు.. మరోవైపు భవిష్యత్తుపై భయం వెంటాడుతోంది. ఇటీవల తమిళనాడులో జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న అన్నాడిఎంకే సంక్షోభం కళ్ల ముందు కదలాడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులే అన్నాడిఎంకే పార్టీలో చీలికకు కారణమని అరవ రాష్ట్రంలో బలంగా నాటుకుపోయింది. అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకుని.. ప్రాంతీయ పార్టీలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న జాతీయశక్తులను ఎదుర్కొవడం డిఎంకే నాయకత్వం ముందున్న సవాలు. కారణం కురుణా నిధి వారసుల మధ్య అనైక్యత. స్టాలిన్ కు.. అళగిరి మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. దీనిపై రాజకీయ విశ్లేషకులు సైతం విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

DMK Future in tamilanadu

డిఎంకేలో అన్నదమ్ములిద్దరు అళగిరి, స్టాలిన్ మధ్య చాలాకాలంగా ఆధిపత్యపోరు ఉంది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అళగిరిని 2014లో పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పట్లో అళగిరి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. స్టాలిన్ ను తీవ్రంగా విబేధించిన అళగిరి తండ్రి ఆగ్రహానికి గురయ్యారు. మఠంలో ప్రకటించినట్టు స్టాలిన్ ను వారసుడిగా ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా మధురైకి పరిమితం అయ్యారు. అయితే కరుణా చివరి రోజుల్లో ఆయన మళ్లీ చేరువ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసిపోయారు. స్టాలిన్ – అళగిరి కూడా తరచూ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నాడిఎంకే సంక్షోభం చూసిన తర్వాత వారిలో మార్పు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముందున్న ప్రమాదాన్ని

 DMK Future in tamilanadu

తండ్రి మరణంతో కుటుంబంలో ఇప్పుడు రాజకీయవారసత్వంపై చర్చ ఖచ్చితంగా తలెత్తుతుంది. స్టాలిన్ పార్టీ పగ్గాలు తీసుకుంటారు.. కనిమొళి హస్తిన రాజకీయాలు చక్కబెడుతున్నారు. మరి అళగిరి ఫ్యూచర్ ఏంటి అన్నది ఆయన అనుచరులు అడుగుతున్న మాట. పార్టీలో అళగిరికి మంచి పేరుంది. సౌమ్యుడిగా.. కలుపుగోలుతనంగా ఉంటారు. తమిళనాడు దక్షిణ ప్రాంతంలో కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో డిఎంకేలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. పార్టీలో ఇప్పుడు లేకపోయినా.. ఆయనకు కేడర్లో బలం ఉంది. ఇంతకాలం సొంత పార్టీ పెట్టకపోవడానికి తండ్రిమీద గౌరవం. ఆయన పట్ల అభిమానం. ఫ్యూచర్ లో కూడా అళగిరిని కాదని డిఎంకే తట్టుకోవడం అంత తేలిక కాదన్నది ఓపెన్ సీక్రేట్. అందుకే అన్నదమ్ములిద్దరూ కలిస్తేనే జాతీయపార్టీల కుట్రలను తట్టుకుని రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకరాగలమన్నది కార్యకర్తల అభిమతం. అంతేకాదు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వాళ్లు పార్టీలను స్థాపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం అంతా ఒక్కతాటిపైకి రావాలి. మరి అళగిరి ఇందుకు ఎలాంటి డిమాండ్లు పెడతారో చూడాలి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -