విరాట్‌ కోహ్లి ఒక్కడి వల్ల కాదు

ఇంగ్లాడ్‌తో జరుగుతున్న రెండో టేస్ట్‌లో పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌ను రక్షించడం కోహ్లి ఒక్కడి వల్ల కాదని హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లడుతూ ” ఇంగ్లాండ్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అక్కడి వాతావరణం భారత్ బాట్స్‌మెన్‌కు అనుకూలించడం లేదు. కోహ్లికి మద్దతుగా ఇతర బ్యాట్స్‌మన్లు నిలబడితేనే  భారత్‌ ఓటమి నుంచి గట్టెక్కుతుందన్నాడు.ఈ మ్యాచ్‌ డ్రా చేసుకుంటే.. మూడో టెస్టుకు ఆటగాళ్లలో విశ్వాసం పెరుగుతోందని” అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 250 పరుగుల ఆధిక్యంలో ఉంది.