చిన్నారి కోపాన్ని చూసి నెటిజన్స్ ఫిదా

కొన్నిసార్లు చిన్నారుల చేసే చిలిపి చేష్టలు ముచ్చటగా అనిపిస్తాయి. వేసవిలో పిల్లలు అందరూ తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి లేదా ఇతర పిల్లలతో కలిసి సరదాగా అడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ తల్లి తన చిన్నారిని ఫ్రీ స్కూల్‌లో జాయిన్ చేసింది. ఒక్కసారిగా ఇంటి వాతావరణం,నుంచి స్కూల్ కు వెళ్లడం ఆ చిన్నారికి నచ్చలేదు. తనను బలవంతంగా స్కూల్ కి పంపడంతో తన తల్లిపై కోపాన్ని వ్యక్తం చేసింది చిన్నారిని. ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ లోపలికి వెళుతున్న సమయంలో తనను వీడియో తీస్తున్న తల్లిపై కోపాన్ని ప్రదర్శించింది. వెంటనే ఆమె తలపై ఉన్న కాగితపు కిరీటాన్ని తీసేసి వీడియో తీస్తున్న ఫోన్ ను కింద పడేసింది. దీంతో తన కూతురు కోపాన్ని చూసి నవ్వుకుంది . ప్రస్తుతం ఈ వీడియో .పషోయాల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చిన్నారి కోపాన్ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.