భారత సంతతికి చెందిన నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత విద్యాధర్ ఇకలేరు

nobel-prize-winner-vs-naipaul-dies-wave-of-mourning-in-literature

భారత సంతతికి చెందిన నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత, ప్రముఖ ఆంగ్ల రచయిత విద్యాధర్ సూరజ్ నైపాల్ (84)కన్నుమూశారు. వయసు మీద పడటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స పొందుతూ మరణించారని నైపాల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. నైపాల్ తండ్రి భారత్ కు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారి. సర్వీసు ఉండగానే వెస్టిండీస్ ట్రినిడాడ్ కు వలస వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. నైపాల్ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు.ఆంగ్ల సాహిత్యానికి అయన చేసిన సేవలకు గాను 2001లో నైపాల్ ను నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. వెస్టిండీస్ లో జన్మించిన నైపాల్, ఇంగ్లండ్ లో స్థిరపడ్డారు. తన జీవితకాలంలో సింహభాగం ప్రపంచ దేశాల పర్యటనల్లోనే గడిపారు. 1971లో ఆయన రాసిన పుస్తకానికి బుకర్ ప్రైజ్ లభించింది.