సమంతకు పీవీ సింధూ సవాల్‌

హరితహారం కార్యక్రమంలో భాగంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ‘గ్రీన్‌ చాలెంజ్‌’ పేరిట మొక్కలను నాటుతూ ఒకిరికొకరు సోషల్‌ మీడియా ద్వారా సవాల్ విసురుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్‌ సమంతకు బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సిందూ చాలెంజ్‌ విసిరారు.సింధూ మూడు మొక్కలు నాటి సమంతతో పాటు బాక్సింగ్‌ స్టార్‌ మేరీ కోమ్‌, హీరో సూర్యలకు హరిత సవాల్‌ విసిరింది. అయితే ఇప్పటికే వంశీ పైడిపల్లి సమంతకు గ్రీన్‌ చాలెంజ్‌ను విసిరారు కానీ సమ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల ఆ సవాలును స్వీకరించలేకపోయింది. సింధూ విసిరిన ఈ సవాల్‌నైనా సమంత స్వీకరిస్తుందో లేదో చూడాలి..!