విశాఖ జిల్లాలో దారుణం.. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

Rape on mental health disability women

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పద్దెనిమిదేళ్ల మానసిక వికలాంగురాలిపై.. 55 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న దురాగతం వెలుగులోకి వచ్చింది. బీమిలి మండలం తాడితురులో పశువుల కాపరి అయిన యువతిని.. అదే గ్రామానికి చెందిన మరో పశువుల కాపరి కనకల సత్యనారాయణ.. మభ్యపెట్టి.. కొంతకాలంగా లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడు. బాధితురాలు అనారోగ్యం పాలవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతిగా తేలడంతో.. విషయం మొత్తం బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.