శత్రువుల నుంచి మనిషి తనకు తాను ఎలా కాపాడుకోవాలంటే..

taikvando games in south koria

తైక్వాండో.. ఈ పేరంటే ముందుగా గుర్తుకువచ్చేది అబ్బురపరిచే స్టన్ట్స్.. శత్రువుల నుంచి మనిషి తనకు తాను ఎలా కాపాడుకోవాలన్న ఆలోచనతో పుట్టిందే ఈ తైక్వాండో. ఈ తరహా స్టన్ట్స్ ను ఎక్కువగా సైనికులకు శిక్షణగా ఇస్తారు. దక్షిణ కొరియా సైనిక దళం కనిపెట్టిన ఈ పద్ధతిని ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి. అందుకే దీన్ని ప్రపంచ యుద్ధకళగా అభివర్ణిస్తారు. తైక్వాండో ను ప్రపంచ ఒలంపిక్ జాబితాలో చేర్చారు. ఈ గేమ్ లో పాదం మరియు పిడికిలి ఉపయోగించి అవతలి వ్యక్తి లేదా వ్యక్తులను ఎదుర్కోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఈ తైక్వాండో పోటీలకు సంబంధించి ఇటీవల ఓ ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. ఇది దక్షిణ కొరియాలో జరిగింది. ఎక్కువశాతం ఒకేసారి ఒకరు లేదా ఇద్దరు పాల్గొనే ఈ క్రీడలో పదుల సంఖ్యలో పాల్గొన్నారు. వారందరూ ఒకరిమీద ఒకరు స్టన్ట్స్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అద్భుతమైన ఫైటింగ్ జిమ్నాస్టిక్ రూపంలో అవతలి వ్యక్తులను ఎదుర్కోవడం చూస్తే ఎవరైనా ఆహా అనక మానరు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -