వైసీపీ-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి

వైసీపీ-బీజేపీలు కుమ్మక్కయాయని మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు ఆరోపించారు. అందుకే వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినా జగన్‌పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గుర్తు చేశారు. రాజకీయంగా పరస్పర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. పీడీ అకౌంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి ఇప్పటికే వివరణ ఇచ్చారని, అసత్య ఆరోపణలతో బీజేపీ, వైసీపీలు.. తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు..

ఈ నెల 14వ తేదీన విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. దీనికి సబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి సుజకృష్ణ రంగారావు సమీక్షించారు..

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -