కుమారుడికి పెళ్లి కావడం లేదని దంపతుల ఆత్మహత్యాయత్నం

కుమారుడికి వివాహం కావడంలేదని తీవ్ర మనస్థాపానికి గురైన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ మండలం రేవూరికి చెందిన టేకి అన్నవరం దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వీరిలో ముగ్గురికి పెళ్లిళ్లుకాగా… చిన్నకుమారునికి వివాహం కాలేదు. పెళ్లిచేసుకోవాలని అతనిపై ఎంత ఒత్తిడిచేసినా కొడుకు వివాహానికి అంగీకరించకపోవడంతో అన్నవరం దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో చేసేదిలేక క్రిమిసంహార మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని జీజీ హెచ్ కు తరలించి చికిత్సఅందిస్తున్నారు.

భార్యపరిస్థితి నిలకడగా ఉన్నా… భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాకినాడ రూరల్ సిఐ రాంబాబుతెలిపారు. అన్నవరం కుటుంబానికి గతంలో కౌన్సిలింగ్ ఇచ్చామని,అయినావీరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆయన అన్నారు. కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు సిఐ రాంబాబు తెలిపారు.