జనసేన పార్టీ గుర్తు ప్రకటించిన పవన్‌కల్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆ పార్టీ గుర్తును ప్రకటించారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా సోమవారం నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గోన్నారు. ఈ సభలోనే ‘పిడికిలి’ జనసేన పార్టీ గుర్తుగా ఆయన ప్రకటించారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని ఆయన తెలిపారు. అన్ని కులాలు, అన్ని మతాలు కలిసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుతామని ఆయన అన్నారు.