విడాకులు కోరిన భార్య.. దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త..!

petrol bomb

భార్య విడాకులు కోరిందన్న కోపంతో మామగారి ఇంటిపై అల్లుడు పెట్రోలు బాంబుతో దాడి చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. తిరునల్వేలికి చెందిన సెల్వికి శరవణన్ అనే వ్యక్తితో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. సంతోషంగా సాగుతున్న వీళ్ల కాపురంలో అలజడి మొదలైంది. పెళ్లై సంవత్సరం కూడా గడవక ముందే ఈ దంపుతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో సెల్వి భర్తను విడిచి పుట్టింటికి వెళ్లింది. అంతటితో ఆగకుండా భర్త నుండి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

దీంతో ఆగ్రహించిన భర్త మద్యం తాగి, శనివారం రాత్రి భార్య దగ్గరకు వెళ్లాడు. తన భార్య, మామాగారితో గొడపడ్డాడు. మాటకుమాట పెరగడంతో శరవణన్‌కి కోపం కట్టలు తెచ్చుకు వచ్చింది. ఆవేశంతో ఇంటిపై పెట్రోలు బాంబును విసిరి పరార్ అయ్యాడు. దీంతో ఆ ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన రెండు బైకులు, ఓ సైకిలు కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని శరవణన్‌ను అదుపులోకి తీసుకున్నారు.