గీతిక గదిలో లభ్యమైన సూసైడ్ నోట్..తన చావుకు..

ఆత్మహత్య వ్హేసుకున్న మెడికో సూసైడ్
ఆత్మహత్య వ్హేసుకున్న మెడికో సూసైడ్

తిరుపతిలో ఆత్మహత్య చేసుకున్న మెడికో గీతిక సూసైడ్ కేసు కొలిక్కి వస్తోంది. ప్రేమ వ్యవహారమే తన చావుకు కారణమంటూ గీతిక రాసిన సూసైడ్ నోట్ ఆమె గదిలో దొరికింది. జీవితం ఇలా అయిపోతుందనుకోలేదంటూ ఆమె తన తల్లికి రాసిన సూసైడ్  లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తను లేకుండా నేను బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నానంటూ ఆ లేఖలో రాసింది గీతిక. ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక మరణం సంచలనంగా మారింది. ఇప్పటికే వర్సిటీకి చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు సెకండియర్ స్టూడెంట్ బలవన్మరణంతో కారణాలు ఏంటన్న దానిపై రకరకాల ఊహాగానానాలు వినిపించాయి. ఒత్తిడి వల్లే ఆమె చనిపోయిందా లేక, వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె చనిపోయినట్టు నిర్థారణకు వచ్చారు.

సూసైడ్ చేసుకుని చనిపోయిన గీతికది కడప జిల్లా. కొన్నేళ్ల కిందటే తండ్రి మరణించారు. దీంతో.. గీతిక చదువు కోసం ఆమె తల్లి హరితాదేవి తాను చేస్తున్న టీచర్ ఉద్యోగం మానేసి తిరుపతికి వచ్చారు. స్థానిక శివజ్యోతినగర్‌లో ఉంటున్నారు. చదువులో తమ కూతురు బాగానే ఉండేదని ఆమె చెప్తున్నారు. ఇవాళ్టి నుంచి కాలేజీలో పాథాలజీ ఇంటర్నల్‌ పరీక్షలు జరగనున్నందున వాటి కోసం ప్రిపేర్ అవుతోందన్నారు. ఐతే.. నిన్న మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేశాక తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది గీతిక. సాయింత్రం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం కలిగి తలుపు తీసి చూస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వెంటనే రుయా ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే గీతిక మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.