16 మంది పిల్లలు కావాలి.. పదోసారి గర్భం దాల్చిన 52 ఏళ్ల మహిళ

తమిళనాడుకు చెందిన 52 ఏళ్ల మహిళకు తొమ్మిది మంది సంతానం. ఒక బిడ్డ ప్రసవంలోనే చనిపోయింది. ప్రస్తుతం ఎనిమిది మంది సంతానం ఉన్న ఈ 52 ఏళ్ల ఆరాయి పదోసారి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండటంతో సింగవనం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళ్లింది. మెరుగైన చికిత్సల కోసం ఆమెను పుదుకోటై ప్రభుత్వ ఆస్పత్రి వైద్య కళాశాలకు పంపారు. పదోసారి ప్రసవం అంటే అత్యంత కఠినమన్నారు వైద్యులు. బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టేందుకు ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తారనే భయంతో ఆరాయి తన భర్తతో కలసి అదృశ్యమైంది. విషయం తెలిసిన వారి బందువులు అనేకచోట్ల గాలించినా ఆ దంపుతుల జాడ తెలియలేదు. ఆనందన్, అతని భార్య ఆరాయికు 16 మంది పిల్లలను కనాలన్న ఆశ ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దంపతుల కోసం గాలిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -