మరోసారి కన్నుగీటిన రాహుల్…ఈసారి ఎవరికంటే..

rahul gandhi wink

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌగిలింతలు, కన్నుగీటడంతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మరోసారి కన్ను కొడుతూ కెమెరా కంటపడ్డారు. అయితే.. ఈ సారి ప్రధాని నరేంద్ర మోడీకి కాకుండా.. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్‌కు రాహుల్ కన్నుగీటారు.రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ సచిన్‌ పైలట్‌కు కన్ను గీటుతున్న విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

రాహుల్‌ కన్ను కొట్టిన మరుక్షణమే సచిన్‌ పైలట్‌ వేదిక మీదున్న మాజీ సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ను కౌగిలించుకున్నారు. అయితే.. ఇదంతా రాజస్తాన్‌ కాంగ్రెస్‌లో ఐక్యతకు సంకేతంగా, వేదికపై కౌగిలింతల సీన్‌ రక్తికట్టించారన వాదన వినిపిస్తోంది.

మరోవైపు సభలో రాహుల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు జాతీయ గీతం ఆలపిస్తుంటే.. దానిపై దృష్టి పెట్టకుండా.. రాహుల్ కుళ్లు జోకులేసుకుంటూ నవ్వడం వివాదాస్పదమవుతోంది.