తన సీమంతంలో స్టెప్పులతో అదరగొట్టిన అందాల తార

ramba, ramba dance

సౌత్ సినీ ఇండస్ట్రీలో యువతను ఉర్రూతలూగించి స్టార్ హీర్‌యిన్‌గా వెలుగొందారు అందాల తార రంభ. వెండితెరపై తన అందం, అభినయంతో అభిమానులను మెప్పిచింది. బిజినెస్‌ మ్యాన్‌ ఇంద్రన్‌ పద్మనాభన్‌‌ను పెళ్లి చేసుకుంది రంభ. వివాహమయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. అయితే తను మూడో బేబికి జన్మనివ్వబోతున్నానే శుభవార్తను రంభ ఇటీవలే తన అభిమానులతో పంచుకున్నారు.

#rambhababy #baby #babyshower #rambhababyshower

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

ఈ క్రమంలో రంభ శ్రీమంతం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి పాటలకు అనుగుణంగా స్టెప్పులేసింది.

#rambhababy #baby #babyshower #rambhababyshower

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో కలిసి పోటాపోటీగా స్టెప్పులు వేసిన రంభ.. తన సీమంతం వేడుకలోనూ స్టెప్పులతో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.