రజిని పార్టీలోకి అళగిరి వెళతారా..?

dmk-leader-alagiri-may-join-rajinikanth-party-romurs

తమిళనాడు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మరణించి పది రోజులు కూడా కాకముందే తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కరుణ మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా స్టాలిన్ ఎన్నిక దాదాపు ఖరారైన నేపథ్యంలో సోదరుడు అళగిరి దీన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అళగిరి సినీనటుడు రజినీకాంత్ ను కలిసిన రెండు ఫోటోలను విడుదల చేశారు డీఎంకే నేతలు. వీరు పైకి మామూలుగానే కలిశారని అంటున్నా వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. డీఎంకేలో నేతలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తోన్న అళగిరి.. రజనీకాంత్‌కు చెందిన పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాస్తవంగా కరుణానిధి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయనను చూడటానికి రజనీకాంత్‌ వచ్చారు.. ఆ సందర్బంగా అళగిరి, స్టాలిన్‌ లను రజిని పరామర్శించారు. కాగా అళగిరి, స్టాలిన్ లతో కూడిన రెండు పోటోలను డీఎంకే సోమవారం విడుదల చేసింది. అందులో రజనీకాంత్‌ అళగిరితో సన్నిహితంగా మాట్లాడుతుండగా పక్కనే ఉన్న స్టాలిన్ ఇబ్బందికరంగా ఫీల్ అయినట్టు ఆ ఫొటోల్లో కనిపిస్తుంది. దీంతో డీఎంకే లో తన తమ్ముడికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే అళగిరి అలా చేసి ఉండొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అయితే అళగిరి సన్నిహితులు మాత్రం ఈ రూమర్లను కొట్టిపారేస్తున్నారు.