వారు డీఎంకేను ముక్కలు చేసే కుట్ర చేస్తున్నారు.. : సీనియర్ నాయకులు

dmk meeting in chennai

డీఎంకే చీలిపోనుందా? పార్టీ పగ్గాల కోసం స్టాలిన్, అళగిరి మధ్య యుద్ధం జరుగుతోంది. కరుణానిధికి సంతాపం తెలిపేందుకు అత్యవసరంగా పార్టీ కార్యవర్గం సమావేశం అయింది. DMK అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని స్టాలిన్‌ను సీనియర్లు కోరారు. పార్టీని ముక్కలు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు.

డీఎంకే అత్యవసర కార్యవర్గ సమావేశం భావోద్వేగాల మధ్య సాగింది. కరుణానిధి మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. జీవితమంతా పోరాడిన గొప్ప నేత కలైంగర్ అంటూ సీనియర్లు ఆయన సేవలను, తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప్రసంగించిన స్టాలిన్.. మీరంతా లీడర్‌ను కోల్పోతే.. తాను తండ్రిని కూడా పోగొట్టుకున్నానని అన్నారు. కరుణానిధి అంతిమ ఘడియల్లో ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిశానని.. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతించాలని కోరితే.. నిర్ద్వందంగా తోసిపుచ్చారంటూ కంటతడి పెట్టుకున్నారాయన.

dmk-mlas-are-meet-with-stalin

 

స్టాలిన్ నేతృత్వంలో కార్యవర్గ సమావేశం జరుగుతుండగా.. అళగిరి వ్యవహారం అగ్గి రాజేసింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆయన్ని కరుణ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పటికీ వేటు కొనసాగుతోంది. ఈనేపథ్యంలో అళగిరి పార్టీ సమావేశానికి రాలేకపోయారు. మధురై ప్రాంతంలో మంచి పట్టున్న ఆయన.. రజనీకాంత్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కరుణానిధి చికిత్స పొందుతున్నప్పుడు ఆయన పరామర్శకు వచ్చిన రజనీకాంత్‌ స్టాలిన్‌తో ముభావంగా.. అళగిరితో నవ్వుతు మాట్లాడుతున్న ఫోటోలను డీఎంకే విడుదల చేయడం ఆసక్తిగా మారింది.

dmk-leader-alagiri-may-join-rajinikanth-party-romurs

పార్టీ అంతా స్టాలిన్ నాయకత్వానికి జై కొడుతున్న తరుణంలో.. చీలిక తేవడం అళగిరికి ఈజీ కాదు. సానుభూతి తమ్ముడికే కలిసొస్తుంది. దీంతో.. రజనీ పక్షం వహించే అవకాశం ఉందని ప్రచారం. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్న మోడీ.. డీఎంకేను సైతం ముక్కలు చేసే కుట్ర చేస్తున్నారని సీనియర్లు విమర్శించారు.

డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ ప్రమోషన్ ఊహించిందే. త్వరలో పార్టీ విస్తృత సమావేశం నిర్వహించి లాంఛనం పూర్తి చేయనున్నారు. అళగిరి వ్యూహంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -