చిరంజీవికి చిరు కోపం.. తగ్గించుకుంటే మంచిది: నటుడు

మెగాస్టార్ చిరంజీవికి చిరు కోపం ఉంది. అది కాస్త తగ్గించుకుంటే బావుంటుందని నా సలహా.. అంటూ చిన్ననాటి స్నేహితుడు, రూమ్మేట్ కూడా అయిన నటుడు నారాయణారావు అన్నారు. ఓ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేను, చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్, ప్రసాద్ బాబు మంచి స్నేహితులం.

రోజులో 12 గంటలు మేమంతా కలిసి ఉండే వాళ్లం. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వాళ్లం. ఏదైనా విషయాన్ని మేమంతా లైట్‌గా తీసుకున్నా తాను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకునేవాడు. ఏపని చేసినా చాలా ఇష్టంగా చేసేవాడు. ఆ పని పట్ల అతడు చూపే అంకిత భావం కనిపించేది. కష్టపడి పని చేసేవాడు.

మొదటి నుంచి అతడి ఆలోచనలు అన్నీ మా కంటే భిన్నంగా ఉండేవి. అందుకే అతడు మా అందరికంటే పైస్థాయిలో ఉన్నాడని చిరంజీవి పైకి ఎదిగిన తీరుని మెచ్చుకున్నాడు. అదే విధంగా చిరులో తనకు నచ్చనిది చిరు కోపం అని అన్నాడు. అది కాస్త తగ్గించుకుంటే బావుంటుందనేది స్నేహితుడిగా భావిస్తున్నాను అని నారాయణరావు చెప్పుకొచ్చారు.