జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్..

జియో ఈ పేరు ఇండియా మొబైల్ మార్కెట్‌లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు జియో కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎప్పటికప్పుడూ బంఫర్ ఆఫర్లను ప్రవేశపెడుతూ కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది.

రిలయెన్స్ జియో ఫోన్ ఇప్పటికే లక్షల మంది వాడుతున్నారు. అయితే తాజాగా జియో ఫోన్ హై ఎండ్ మోడల్‌ను తీసుకొచ్చింది రిలయెన్స్. దీనికి సంబంధించిన ఫ్లాష్ సేల్ డేట్‌ను కూడా ప్రకటించింది.

ఆగస్ట్ 16వ తేదిన గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ఉంటుంది. జియో అధికారిక వెబ్‌సైట్ అయిన జియో.కామ్‌లో ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ ఉంటుంది. క్వెర్టీ కీప్యాడ్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.2999.

అయితే ఇటీవలే మాన్‌సూన్ హంగామా ఆఫర్‌ను తీసుకొచ్చింది జియో. దీని కింద యూజర్లు తమ పాత ఫీచర్‌ను ఇచ్చి కేవలం రూ.501కే జియో ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.