ఘాటుగా సాగిన కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం

kakinada-municipal-corporation-meeting

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఘాటుగా సాగింది. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ సుంకర పావని అధ్యక్షతన సమావేశం జరిగింది. హౌస్ ఫర్ ఆల్ స్కీంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కాకినాడ నగరంలో ఒక్క సెంటు స్థలం కూడా లేదని సిటీ ఎమ్మెల్యే కొండబాబు సమాధానమిచ్చారు. రికార్డులను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ.. రైల్వే భూములను కాజేసింది వైసీపీ నేతలేనని కొండబాబు చెప్పడం వివాదాని కారణమైంది.

ఎమెల్యే కొండబాబు వ్యాఖ్యలతో కౌన్సిల్లో దుమారం రేగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా వైసీపీ నేతలపై ఎలా ఆరోపణలు చేస్తారని ఆపార్టీ కౌన్సిరల్లు ఆందోళనకు దిగారు. భూకబ్జాలకు పాల్పడేది టీడీపీ నేతలే అంటూ కార్పొరేటర్ కిషోర్ అనడంతో.. ఇరువర్గాల కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు

కాకినాడ మెయిన్ రోడ్డు పనులు నాలుగేళ్లుగా ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్దే దుస్థితి పట్టిందని వైసీపీ కార్పొరేటర్ కిశోర్ చంద్రకళా ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను ఎమ్మెల్యే కొండబాబు ఖండించారు. రోడ్ల అభివృద్ధికి కావాల్సిన నిధుల్లో 80శాతం ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందువల్ల పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. మొత్తానికి అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదనలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కీలక అంశాలేవీ చర్చకు రాకుండానే కౌన్సిల్ సమావేశం ముగిసింది.