డల్ రాజు నీతులు చెప్పడం ఆపు

latest news about dill raju srinivasa kalyanam

ఎంటర్టైన్మెంట్ కోసమే 3 గంటలు టైమ్ వెచ్చించి ఆడియన్స్ ధియేటర్లకు వెళతారు. కానీ ఆ టైమ్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయకుండా క్లాసులు పీకితే రిజల్ట్ ఎలా ఉంటుందో శ్రీనివాసకళ్యాణం సినిమా ఫలితం చూస్తే తెలిసిపోతుంది. శ్రీనివాసకళ్యాణం…దిల్ రాజు నిర్మించిన కొత్త సినిమా ఇది. నితిన్, రాశీఖన్నా జంటగా నటించారు. పెళ్ళి నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో, ఇదే బ్యాక్ డ్రాప్ లో గతంలో వచ్చిన మరి కొన్ని చిత్రాలతో కంపేర్ చేసి, సినిమా ఆదరణ పొందడం కష్టమే అనే ఆడియన్స్ ముందే డిసైడ్ అయ్యారు. రిలీజ్ అయ్యాక అదే నిజమైంది. రీసెంట్ గా రిలీజైన శ్రీనివాసకళ్యాణం ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోవడంతో పాటు, వారి చేతే నెగిటివ్ కామెంట్లు, సెటైర్లు వేయించుకునే పరిస్థితి వచ్చింది. ఈ టాక్ వల్ల బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్లు కూడా రావడం లేదు.

పెళ్ళి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో స్లో నేరేషన్ తో ఆడియన్స్ ఇబ్బంది పెట్టిన టీమ్. ప్రధాన పాత్రలైన ప్రకాష్ రాజ్, నితిన్ క్యారెక్టర్లతో క్లాసులు పీకించారు. అసలే స్లో నేరేషన్ తో ఇబ్బంది పడుతున్న ఆడియన్స్ కి, పుండు మీద కారం చల్లినట్లు, ఈ క్లాసులు కూడా ఓవర్ అవ్వడంతో, ధియేటర్లలో ఎంజాయ్ చేయడం మానేసి, సెటైర్లు వేస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సక్సెస్ మీట్స్ అంటూ ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి, మిగతా నటీనటులను ఎక్కువగా మాట్లాడించకుండా, నిర్మాత దిల్ రాజు మాత్రం సినిమా హిట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాదని ఎవరైనా అన్నా వారికి కూడా క్లాస్ పీకడం మొదలవుతోంది. మెస్సేజ్ లు, క్లాసులు కాకుండా మాకు వినోదమే కావాలని ఆడియన్స్ డైరెక్ట్ గా చెబుతున్నా…నిర్మాత దిల్ రాజుకి మాత్రం అర్ధం కావడం లేదు.