రూపాయి మారకం విలువ మరింత పతనం

latest-news-rupee-hits-all-time-low-at-70-per-dollar

టర్కీ కరెన్సీ దేశీయ కరెన్సీని వణికిస్తోంది. ఇవాళ రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. చరిత్రలో మొదటిసారిగా డాలర్‌తో పోలిస్తే 70 మార్కును దాటింది రూపాయి మారకం విలువ. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 10శాతం మేర బలహీనపడి ఇవాళ రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 70.08 వద్ద రూపీ కదలాడుతోంది. రూపాయి బలహీనంతో ఎగుమతి సంబంధ రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇంపోర్ట్స్‌ భారం మాత్రం మరింత పెరగడం దిగుమతిదారులను కలవరపెడుతోంది.