ఆర్టీసీ బస్సుకింద పడి వ్యక్తి బలవన్మరణం

suicide

కడపజిల్లా జమ్మలమడుగులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎరువుల దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి.. యజమానితో మాట్లాడి, వెంటనే అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యం ఎరువుల దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.