బ్యాంకాక్‌లో మచిలీపట్నం వాసి మృతి

manchipatnam-died-in-bangkok

బ్యాంకాక్‌లో మచిలీపట్నం వాసి మృతి చెందాడు. దివాన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో క్రెడిట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పల్లంపాటి వెంకటేష్‌.. కంపెనీ పని మీద బ్యాంకాక్‌ వెళ్లాడు. ‌అతడు బస చేసే హోటల్‌ దగ్గర స్విమ్మింగ్‌ పూల్‌లో కాలు జారి పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఇవాళ మచిలీపట్నానికి వెంకటేష్‌ మృతదేహం చేరనుంది. ఉన్నత స్థితిలో ఉన్న కొడుకును పోగొట్టుకున్న వెంకటేష్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వెంకటేష్‌ మృతితో మచిలీపట్నంలో విషాదచాయలు అలముకున్నాయి.