సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఎద్దు ఫోటో

photograph-shows-bull-being-lowered-crane

ఈ ఫోటో చూసి ఎద్దును క్రేన్‌ సాయంతో మూడంతస్తుల భవనం మీదనుంచి కిందకు దించుతున్నారనుకుంటున్నారా..? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. వారు ఆ ఎద్దును వధించడం కోసం తీసుకొచ్చారు. ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్‌ పండుగ సందర్భంగా కరాచీకి చెందిన ఓ వ్యక్తి తన ఎద్దును స్థానిక పశువుల సంతలో అమ్మాలనుకున్నాడు. అయితే ఆ ఎద్దు తన ఇంట్లో మూడో అంతస్థులో ఉంది. దాన్ని బిల్డింగ్‌ మీద నుంచి క్రేన్‌ సాయంతో కిందకు దించారు. అందులో భాగంగా ఎద్దు నోరు, కాళ్ళు చేతులను తాళ్లతో బంధించాడు. అంతేకాక దాని కొమ్ములకు పాకిస్తాన్‌ జెండాలను కట్టాడు. ఓ ఫోటోగ్రాఫర్‌ తీసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసిన జంతు ప్రేమికులు కొందరు మండిపడుతున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -