టీసీఎస్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పూర్తిచేసిన వారికి అవకాశాలు

2019 నాటికి ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన వారితో పాటు, జనరల్ డిగ్రీ చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించింది ప్రసిద్ధ టీసీఎస్ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీసీఎస్ టెక్నికల్ విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలను అందించనుంది.
పోస్టులు: నింజా డెవలపర్లు
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ చేసిన వారు, ఇంజీనీరింగ్‌లో అన్ని స్పెషలైజేషన్లు చేసిన వారు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర సంబంధిత విభాగాల వారూ, డిగ్రీలో
బీఎస్సీ/బీసీఏ/బీకాం/బీఏల్లో మేథమేటిక్స్/ స్టాటిస్టిక్స్ చదివి, ఆపై ఎంసీఏ చేసినవారూ అర్హులు.
సంబంధిత సబ్జెక్టులలో 60% మార్కులు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పరీక్ష రాసేనాటికి బ్యాక్‌లాగ్ ఒకటికి మించి ఉండకూడదు. డిగ్రీ పూర్తయిన తరువాత రెండేళ్లకు మించి విరామం ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ: నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.careers.tcs.com లో బిగినర్స్ ట్యాబ్ కింద ఉన్న న్యూ యూజర్‌ను ఎంచుకోవాలి. దానిలో ఐటీని క్లిక్ చేసి దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి.
అప్లికేషన్ రిసీవ్‌డ్ అని వచ్చాక అప్లై ఫర్ డ్రైవ్ మీద క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 20, 2018.
పరీక్ష తేదీలు: 2018 సెప్టెంబరు 2,3 తేదీలు