యాంకర్ ఎలా అయ్యావన్నాడు.. అడ్రస్ లేకుండా పోయాడు: నటి

karuna bhushan, actress

ఒకప్పుడు నాకు తెలుగు రాదు అని చెప్పుకోవడం ఫ్యాషన్ అని భావించేవారు. ఇప్పుడు నేను తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నాను అని గర్వంగా చెప్పుకుంటున్నారు సినిమా నటీనటులు కానీ యాంకర్లు కానీ. ‌ప్రముఖ చానెల్‌లో వస్తున్న ‘విహారి’ అనే ప్రోగ్రాంకి కరుణ బూషణ్ యాంకరింగ్ చేస్తుంది. చానెల్‌కి వచ్చిన కొత్తలో తనకు జరిగిన అవమానాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. జాయిన్ అయ్యే ముందే నాకు తెలుగు రాదు. కానీ ఓ సారి వింటే చెప్పగలుగుతాను అని నిర్మాతకి చెప్పాను. ఇంతకు ముందు ఎక్కడా యాంకరింగ్ చేసిన అనుభవం కూడా లేదని చెప్పాను. అయినా ఆ ప్రోగ్రాం చేయడానికి వెళ్లినప్పుడు దర్శకుడు నీకు తెలుగు రాదు.. యాంకరింగ్ తెలియదు..నువ్వేమైనా స్టారననుకుంటున్నావా అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అని చెప్పింది. ఒక వేళ నేను యాంకరింగ్ పనికిరాను అని అనుకుంటే తీసేయండి అని అన్నాను. నేను తెలుగు నేర్చుకుని యాంకరింగ్‌గా నా కెరీర్‌లో ముందుకు పోతున్నాను అని గర్వంగా చెప్పింది. నన్ను అన్న దర్శకుడు మాత్రం ఆ తరువాత అడ్రస్ లేడు అని అన్న కరుణ తన టాలెంట్‌తోనే అతడి సమాధానం చెప్పానని అంటోంది.