నవ్యాంధ్రను అగ్రపథాన నిలబెట్టడమే నా లక్ష్యం

 

రాష్ట్రాన్ని ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. 2029 కల్లా ఏపీని దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారాయన. 72వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో పాల్గొన్న బాబు పతావిష్కరణ చేసి జాతీయ జెండాకు వందనం సమర్పించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో ఐదోసారి జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవాలకు శ్రీకాకుళం వేదికగా నిలిచింది. విభజన తర్వాత ప్రతి ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య వేడకలను నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. గత నాలుగేళ్లలో కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో వేడుకలు జరగ్గా.. ఈ సారి శ్రీకాకుళంలో జెండా పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హజరైన సీఎం చంద్రబాబు..మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ నాలుగేళ్లలో ఏపీ సాధించిన అభివృద్ధిని వివరించిన బాబు..విభజనతో నష్టపోయినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తమ కృషి ఫలితంగా రెండెకల అభివృద్ధి సాధ్యమైందని గుర్తు చేశారాయన. నవ్యాంధ్రను అగ్రపథాన నిలబెట్టడమే తమ లక్ష్యమన్న బాబు.. విజన్ 2050ని రూపొందించినట్లు చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధిని వివరిస్తూనే..అటు కేంద్రం సహాయ నిరాకరణపై ఫైరయ్యారు బాబు. ప్రత్యేక హోదా ఇస్తామని వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి.. ఇప్పుడు చేతులెత్తేశారంటూ చంద్రబాబు ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. రైల్వే జోన్.. కడప ఉక్కు కర్మగారాన్ని పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు

 

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -