గుండెపోటుతో గవర్నర్‌ మృతి

chhattisgarh-governor-balramji-dass-tandon-dies

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరాం దాస్‌ టాండన్‌ నిన్న ఉదయం గుండెపోటుతో రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. గవర్నర్‌ మరణంతో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఆయనకు నివాళిగా ఇవాళ జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేసింది. ప్రజల సందర్శనార్థం టాండన్ పార్థీవ దేహాన్ని రాజ్‌భవన్‌కు తరలించారు. పంజాబ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బలరాం దాస్‌ టాండన్‌ 1927లో పంజాబ్‌లో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో ప్రచారఖ్‌గా పని చేశారు. జన సంఘ్‌ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 1969- 70లో పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1975- 77 ఎమర్జెన్సీ సయమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన బలరాం దాస్‌ 2014 జూలై లో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

బలరాం దాస్ టాండన్ మృతితో మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు ఛత్తీస్‌గడ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె రాయ్‌పూర్ రాజ్‌భవన్‌లో ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆనందీబెన్ పటేల్ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -